మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నగర కార్పొరేషన్ ఇ.ఇ.లు మరియు డి.ఇ.లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి పనివారిగా పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 303 పనులలో 62 పనులు పూర్తయినట్లు, 2 పనులు అసలు ప్రారంభం కానట్లు, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తించారు.ప్రారంభం కానీ రెండు పనులు 24 గంటల్లో ప్రారంభించాలని అధికారులకు మరియు సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీచేశారు.
ఈ 303 అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి రోజు ఫోన్ లో నేను సమీక్షిస్తూ ఉంటానని, ప్రతి శుక్రవారం సాయంత్రం దీనిపై అధికారులతో సమీక్ష ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.