రౌతులపూడి మన న్యూస్ (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలంలోని స్థానిక మదీనా మసీదులో tv1 రిపోర్టర్ గొంప గోవిందు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిపి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని గోవిందు అన్నారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సతీష్, సుర్ల శ్రీను, కమిటీ పెద్దలు షేక్ సర్దార్, షేక్ తానుషావల్లి, షేక్ హుస్సేన్, షేక్ సలీం, హఫిజ్ నాసిర్, షేక్ హుజైఫా, తదితరులు పాల్గొన్నారు.