మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కే.పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని,ఆయన మృతి క్రైస్తవ సోదరులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.ప్రవీణ్ పగడాల మృతి పై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్నికోరుతున్నామన్నారు.అంతేకాకుండా పాస్టర్లు అంటే ప్రార్థన చేసి మంచి కోరుతాం కానీ చెడు చేయమని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో క్రైస్తవులపై అనేక రకాలుగా పోస్టులు పెడుతున్నారని దానిపై ప్రభుత్వం దృష్టి సారించి పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు జాన్ విల్సన్ బాబు, పౌండర్ ఎస్. ఎలైజా,ఉపాధ్యక్షులు ఏబీవీ ప్రసాద్,కార్యదర్శి సంపత్ ప్రభుదాస్,ట్రెజరర్ వాసా సామ్యేల్,పల్లి నెల్సన్, శామ్యూల్,జాన్ విల్సన్,కె.మణీ కుమార్,బి. సునీత పాల్,వి.సురేష్,వాసా లాజర్ బాబు,పొతల రమేష్,గంటా రాజు, కే సమర్పణ రావు,వి.బార్న బాస్ తదితరులు పాల్గొన్నారు.