Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరంమండలం యర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకరావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన బుధవారం నిర్వహించారు.అన్న ప్రసాదాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వితరణ చేపట్టారు.భక్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న సంతర్పణలో తమ వంతు సేవలందించారు.అయ్యప్ప స్వామి మాల ధారణ స్వీకరించిన భక్తులకు ప్రత్యేక కౌంటర్లలో భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీఇంచార్జి నీరుకొండ సత్యనారాయణ,టీడీపీ నాయకులు జ్యోతుల పెదబాబు,బొదిరెడ్డి గోపీ,మూది నారాయణ స్వామి,జిగటాపు సూరిబాబు, గుల్లంపూడి గంగాధర్,ఎన్డిఏ కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.