మనన్యూస్,నెల్లూరు:బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నగర డి.ఎస్.పి సింధు ప్రియా కి వినతి పత్రం అందజేశారు.బెట్టింగ్ మాఫియా బారిన పడి ఎంతోమంది యువత పెడద్రోవ పడుతున్నారని.. డిఎస్పి కి వారు వివరించారు.ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున , ఆశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ..,…..నెల్లూరులో రోజురోజుకు బెట్టింగ్ మాఫియా జోరుగా విస్తరిస్తుందన్నారు.ఎంతోమంది యువత ఈ బెట్టింగ్ మాఫియా.. వలలో చిక్కుకొని.. వారి జీవితాలను చిన్నబిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బెట్టింగ్ మాఫియా పై.. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్న వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.బెట్టింగ్ మాఫియా ఆగడాలను అరికట్టే విధంగా.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బెట్టింగ్ మాఫియా..ను అరికట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయి లో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.