మనన్యూస్,తిరుపతి:తెలుగు వత్సరాది ఉగాది తరువాత తిరుపతిలో జరగనున్న క్షత్రియ సోదరుల ఆత్మీయ సమావేశానికి హాజరు కావలసిందిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు, రుద్రరాజు గురు ప్రసాద్ రాజు, భాస్కర్ రాజు, మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ చైర్మన్ భాస్కర్ రాజు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ గుండ్రాజు సుకుమార్ రాజులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. టిటిడి నిఘా విభాగపు ముఖ్య భద్రతాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజును వారు అభినందించారు. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.