మనన్యూస్,తిరుపతి:యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతికి చెందిన బిసి నేత జి నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి చిత్తూరు తిరుపతి జిల్లాలలోని బిసి లందరూ భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్నాథం మాట్లాడుతూ నరసింహ యాదవ్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చిత్తూరు తిరుపతి జిల్లాలకు చెందిన బిసి లందరూ భారీ సంఖ్యలో తరలివెల్లి విజయవంతం అయ్యేందుకు ఐక్యత చాటుదామని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో నరసింహా యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. 2024 ఎన్నికలలో టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి నరసింహ యాదవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎంతో శక్తి వంచన లేకుండా బీసీలందరినీ సమయత్వం చేసి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో పాటు పడ్డారని పేర్కొన్నారు. అనంతరం రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, రజక సంఘం రాష్ట్ర నేత అక్కినపల్లి లక్ష్మయ్య లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా సముచిత స్థానం కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. కావున రెండవ తేదీ జరగబోయే నరసింహ యాదవ్ ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజకులతో పాటు అన్ని బీసీ కులాలకు చెందిన ప్రతినిధులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని తెలిపారు.ఈ సమావేశంలో టిడిపి నేతలు అశోక్,భక్తవత్సలం, ఆముదాల తులసీదాస్ పాల్గొన్నారు.