మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట బారాషాహీద్ దర్గాలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర కమీషనర్ సూర్యతేజ, ఐఏఎస్ , నగర డిఎస్పీ తో మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఈద్గాల వద్ద మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దేవస్థానాలు, మసీదు, చర్చులు వద్ద ఫ్లెక్సీలు వద్దు. ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.