Mana News ;- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి:- మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు,శ్రీ లలితా మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఆ పరమశివుని ఆశీస్సులు వల్లే జ్యోతిర్లింగాలను ప్రతిష్టించగలిగా మని వారు అన్నారు.అంతేకాకుండా జ్యోతిర్లింగాలకు మంగళవారం హోమాలు ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకం నిర్వహించి జ్యోతిర్లింగాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించడం జరిగిందని వారు అన్నారు.ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక వివేకానంద సేవా సమితి,శ్రీలలిత మాతృమూర్తుల ఆధ్వర్యంలో అనేక అత్యంత భక్తి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల కార్యక్రమంలో మైరాల నాగేశ్వరరావు, పంతం పద్మనాభం,బుగతా సుగుణ, అడపా శివప్రసాద్ ,పాబోలు దేవి,శ్రీ లలిత మాతృమూర్తి సంఘ సభ్యులు,భగవత్ భక్తులు,ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.