మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది.ఈ సందర్భగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వెళ్ళబుచ్చింది.ఏలేశ్వరం యర్రవరం గ్రామానికి చెందిన గురిమెరికల వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్ తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని,నన్ను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది.తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు పలు అవసరాలకు నా తాలూకా సొమ్మును తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదు అంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది.సుమారు 8 లక్షల వరకు నా వద్ద నుంచి తీసుకొన్నారని, అదేగాక కొంత బంగారం వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. నేను ఒంటరిదాన్ని అందుకనే సిపిఐ ఎంఎల్ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘాల్ని ఆశ్రయించానని ఆవేదన చెందింది.
ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్,మహిళా సంఘ నేతగండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు.