మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సాయిలు తెలిపారు.బుధవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందన్నారు. జుక్కల్ నియోజకవర్గం కోసం ప్రతిక్షణం కష్టపడుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మండల ప్రజల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హన్మాండ్లు స్వామి, ఆలయ చైర్మన్ రాంపటేల్, విఠల్ గురూజీ, తదితరులు పాల్గొన్నారు.