మనన్యూస్,నారాయణ పేట:ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ.రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేతలు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బి.చంద్రకాంత్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని, అందుకు తగినట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు ఇప్పటినుంచి సంసిద్ధం కావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనట్టుగా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. గత పదేళ్ళలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందాయని తెలిపారు. ప్రతి బూత్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, పార్టీ బలోపేతం దిశగా కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా సమిష్టి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.