సదస్సుమాధకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం - ఎస్సై రాజ్ కుమార్
Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్ 13, 2024బుధవారం స్థానిక ఎక్స్లెంట్ భాష హైస్కూల్లో ఏడూళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మాధకద్రవ్యాల వలన కలిగే నష్టాలను విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్, మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వలన యువత భవిష్యత్తు నాశనం అవతుందని. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్ప వారిని చేయాలని ఆశతో ఉంటే కొంతమంది డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆటకట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉందని ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్మిన, సరఫరా చేసినట్టు తెలిసిన స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ సూచించారు. మాదకద్రవ్యాలు విద్యార్థుల, యువత జీవితాలను నాశనం చేస్తాయని వాటిని దరిచేరనీయ వద్దని మాదకద్రవ్యాల మత్తులో యువత పడవద్దని కరకగూడెం ఎస్సై రాజేందర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ,పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.