మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో సిసి రోడ్డు పనులను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డిలు కలిసి సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి గ్రామ గ్రామ గ్రామాన అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ సాయిరెడ్డి,మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాయినాథ్,తదితరులు ఉన్నారు.