మనన్యూస్,సీతారాంపురం:మండలం పోలం గారి పల్లి గ్రామ సర్పంచ్ ముత్తూరు వెంకటసుబ్బయ్య మేనమామ రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు మల్లి బోయిన తిరుమలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ బుధవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మల్లి బోయిన తిరుమలయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ వారి నివాసానికి వెళ్లి తిరుమలయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఏ లోకంలో ఉన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య సీతారాంపురం మండలం కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు సీతారాంపురం మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.