మనన్యూస్,పిఠాపురం:నియోజకవర్గం ఉ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం నందు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మూలపేట గ్రామ సర్పంచ్ కంబాల మౌనిక లక్ష్మణ ఆధ్వర్యంలో అంజు కంటి ఆసుపత్రి ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ తేజ ఆధ్వర్యంలో నిర్వహించగా. 190పైచిలుకు మూలపేట గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు వైద్య సేవలు ఉచితంగా పొందడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు కంటి వైద్య శిబిరం కాకినాడకు చెందిన అంజు కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు190 మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 20 మందికి కళ్ళజోళ్ళు,8 మందికి ఆపరేషన్లు ఎంపిక చేసి తమ సొంత వాహనంలో ఆసుపత్రికి రోగులను ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కంబాల మౌనిక లక్ష్మణ్, జనసేన సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు,డాక్టర్ సాయి ప్రియ, డాక్టర్ సమత మాట్లాడారు. ఆసుపత్రి మేనేజర్ ప్రదీప్, జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.