Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 13)మన న్యూస్ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ నుండి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వరకు చేపట్టిన లింకు రోడ్డు పనులను, రాజీవ్ గృహ కల్పలోని పలు సీసీ రోడ్డు పనులను ఏఈ భాస్కర్ తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ రు మాట్లాడుతూ..పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప పరిసర ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు. దాదాపుగా రోడ్లు పూర్తవ్వగా మిగిలిన కొన్ని చోట్ల నూతన సీసీ రోడ్ల పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణను గాడిలో పెట్టాలని ఆ విభాగల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తిలు, కాలనీల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్వర్లు, లింగ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధారాణి, కుమారి, శశికళ, పద్మిని, కీర్తి, పుష్ప, విశాల్, తిరుపతి రావు, శ్రీను, రెబెక, సునీత తదితరులు పాల్గొన్నారు.