మనన్యూస్,శంఖవరం:ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజక వర్గంలో వివిధ రోడ్ల నిర్మాణమునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 15 కోట్ల 83 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే సత్య ప్రభ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని, అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను, అడిగిన వెంటనే విడుదల చేస్తూ నియోజవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న సహకారం మరువలేనిది అని కొనియాడారు. నియోజవర్గంలో బీటీ రోడ్లకు, సీసీ రోడ్లకు ఇప్పటికే కోట్ల రూపాయలను మంజూరు చేసి సహకరించడం జరిగిందని, నియోజవర్గంలోని బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణమునకు భారీ స్థాయిలో నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నియోజవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఏలేశ్వరం మండలంలో సిసి రోడ్ల నిర్మాణమునకు 62 లక్షల రూపాయలను, ప్రత్తిపాడు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణమునకు కోటి 33 లక్షల రూపాయలను, శంఖవరం మండలంలో సీసీ రోడ్ల నిర్మాణమునకు 80 లక్షల రూపాయలను, రౌతులపూడి మండలంలో సీసీ రోడ్ల నిర్మాణమునకు 85 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. కొంతంగి కొత్తూరు నుండి అచ్చంపేట మీదుగా గొంది కొత్తపల్లి గ్రామానికి బీటి రోడ్డు నిర్మాణం కు రెండు కోట్ల 20 లక్షల రూపాయలను, కత్తిపూడి జాతీయ రహదారి నుండి వజ్ర కూటం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి కోటి 98 లక్షలు, ఎలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం నుండి తిరుమాలి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణమునకు 70 లక్షలు, జాతీయ రహదారి చిన్నింపేట నుండి పెద్దనాపల్లి గ్రామానికి బీటీ రోడ్ నిర్మాణమునకు కోటి 35 లక్షలు, రౌతులపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం గ్రామం నుండి ఎన్ . ఎన్ పట్నం వరకు బీటి రోడ్ నిర్మాణమునకు రెండు కోట్ల 60 లక్షల రూపాయలు, రౌతులపూడి , గిడజం రోడ్డు నుండి బి.బి. పట్నం మీదుగా లచ్చిరెడ్డిపాలెం వరకు బీటీ రోడ్ నిర్మాణనకు కోటి 80 లక్షల రూపాయలు, రాజవరం నుండి దిగువశివాడ గ్రామం వరకు బీటీ రోడ్ నిర్మాణమునకు కోటి రూపాయలు, రాజవరం ,దిగువ శివాడ రోడ్ నుండి గంగవరం వరకు బీటీ రోడ్ నిర్మాణమునకు 60 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని పాత్రికేయల సమూహంలో వెల్లడించారు.