మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు ప్రజా నివాసాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రముఖ దేవాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరగా. హైవే ఆనుకొని మద్యం షాపులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే ఆ ప్రాంతాల నుండి తొలగించాలని కోరుతూ జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ దాడిశెట్టి వీరబాబు సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో జిల్లా జాయిట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎక్సైజ్ సూపరిటెండెంట్ కృష్ణ కుమారికు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాడిశెట్టి వీరబాబు మాట్లాడుతూ తమ ఫిర్యాదు మేరకు అక్రమ దుకాణాలపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయిస్తామని వీరబాబు హెచ్చరించారు. 30.09.2024లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో జీవో నంబర్ 210ను ఉల్లంఘిస్తూ జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, గోకవరంలో ప్రధాన రహదారి 164కు ఆనుకొని మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారని తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా మధ్యం దుకాణాలను ప్రభుత్వ కార్యాలయాలకు, దేవాలయాలకు చర్చి, మసీదు వంటి ప్రార్థన స్థలాలకు దూరంగా ఉండాలన్న కనీస నియమాలను పాటించడంలేదన్నారు. ప్రత్తిపాడు. ఏలేశ్వరం ఇదే పరిస్థితి ఉందన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందచి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు , పార్లీమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగుపల్లి కృష్ణ,హరీష్రావు, పాలూరి గణేష్ తదతరులు పాల్గొన్నారు.