మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైద్య విద్యార్థులతో కలిసి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.క్షయ వ్యాధి గ్రస్తులకు దూరంగా ఉండాలన్నారు.ఈ వ్యాధి సోకిన వారు దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. నిరంతరంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, అలసట, రాత్రివేళ చెమట వంటివి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూ పి హెచ్ వైద్యాధికారులు సరోజ, బోదిరెడ్డి గోపి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, టీబీ సూపర్వైజర్ అనిల్ కుమార్, మూడీ నరసయ్య, జొన్నాడ వీరబాబు, కోనాల వెంకటరమణ, మరియు హాస్పటల్ స్టాప్, ఏఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు