మనన్యూస్,నారాయణ పేట:కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కున్సి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా సోమవారం ఉదయం కృష్ణ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ ఎస్సై నవీద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించే విధుల పైన అవగాహన కల్పించారు.పోలీసులు నిర్వర్తించే విధుల పైన, అత్యవసర సమయంలో డయాల్ 100 కాల్స్ పై, పోలీస్ స్టేషన్లో వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమాచారం చేరవేసే విధానం, పోలీస్ స్టేషన్లో (5 ఎస్ విధానం) ఆఫీస్ ఫైల్స్ క్రమబద్ధతిగా ఉంచే విధానం, జనరల్ డైరీ, ఎఫ్ ఐ ఆర్ ఏ విధంగా నమోదు చేస్తారని, ఎలాంటి కేసులు ఎక్కువగా వస్తాయి అని, పోలీస్ పెట్రోలింగ్ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నందున సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయని విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు కోరారు. విద్యార్థులు మీ ఇంటి పక్కల మీ బంధువులు స్నేహితులు సైబర్ క్రైమ్ గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలు, అపరిచిత వ్యక్తుల నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫోన్ అధిక వినియోగం వల్ల ఏర్పడే అనార్థాలు, బాల కార్మిక వ్యవస్థ, పోలీస్ చట్టాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదువుకోవాలని, ఉన్నత చదువులు చదివడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ గంజాయి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.