మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు.
రోడ్డు పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా పనులలో నాణ్యత విధానాలను పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లును నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
బిచ్కుంద మండల కేంద్రంలో వాజీద్ నగర్ గ్రామంలో నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయలు కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట పిఏసిఎస్ చైర్మన్ శివా నంద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయగౌడ్, రమేష్ దేశాయ్ ,సతీష్ పటేల్, గంగాధర్ ,తదితరులున్నారు.