Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్.... శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ సభ్యులకు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ మిత్రులకు నాకు అధికారం ఉన్న లేకపోయినా మంచి సత్స సంబందాలు ఉన్నాయని. వారిని సన్మానించడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. మీడియా సోదరులు ప్రచురించే వార్తలను రాజకీయ కోణాలతో చూడకుండా ఆ వార్తలలో వాస్తవాలను గ్రహించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా మీడియా సోదరులు నిలుస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రజా సమస్యలను రాజకీయ నాయకులు. ప్రజలు ముందుకు ప్రతినిత్యం ప్రచురిస్తున్న మీడియా సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి. వెంకటరమణారెడ్డి. గోపాల్. తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ టాప్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను సన్మానిస్తున్న బిజెపి నేత కోలా ఆనంద్