
మనన్యూస్,వింజమూరు:వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, కార్పొరేట్ వైద్యశాలలలోవైద్యం అందించుకొని, తమ సొంత నగదును ఖర్చు చేసుకున్న సుమారు 78 మంది బాధితులకు సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత మంజూరు చేయించి, ఉదయగిరి నియోజకవర్గం లోని 78 మంది బాధితులకు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.
వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆదివారం పండుగ వాతావరణం లో 8 మండలాల టిడిపి మండల కన్వీనర్ లు, ముఖ్య నాయకులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ ఆధ్వర్యంలో బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకొని ఆనందం వ్యక్తం చేస్తూ, గతంలో మునుపెన్నడు లేని విధంగా పార్టీలకు అతీతంగా, మాకు అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. మనసున్న మారాజు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందని వైద్యానికి సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించామని, చాలామంది బాధితులను దగ్గరగా చూశానని, అనుకోకుండా వచ్చే జబ్బులతో కుటుంబాలు చిన్న భిన్న అవుతున్నాయని వారందరిని ఆదుకునేందుకు నేనెప్పుడూ ముందు ఉంటాను అని తెలిపారు. అదేవిధంగా టిడిపి సభ్యత్వం కుటుంబానికి అండగా నిలుస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రజల పేదరికం నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు, మండల కన్వీనర్లు గొంగటి రఘునాథరెడ్డి, పేలపూడి వెంకటరత్నం, సిహెచ్ బయన్న, చండ్రా మధుసూదన్ రావు, కప్ప ప్రభాకర్ రాజు, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మధు మోహన్ రెడ్డి, జిల్లా కార్యనిర్వక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ముఖ్య నాయకులు కూటమినేతల తదితరులు ఉన్నారు.
