Mana News :- గొల్లప్రోలు నవంబర్ 13 మన న్యూస్ : చిన్న పిల్లల్లో న్యూమేనీయ వ్యాధి నిర్మూలనకు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నట్టు డాక్టర్ సుబ్బారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.0-5 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాది వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఇంటింటి సర్వే లో వ్యాది లక్షణాలు గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు.రొంప దగ్గు జలుబు జ్వరం లక్షణాలు ఉంటే పిల్లలు ఊపిరి పీల్చడం కష్టం గా ఉండి పిల్లలు పాలు త్రాగడం మానివేస్తారని, అంతేకాకుండా కొద్దిమంది పిల్లలు లో విరేచనాలు అవుతాయని తల్లులకు ఏయన్ఎమ్ లు ఇంటింట సర్వే లో వివరిస్తున్నట్లు చెప్పారు.ప్రతీ చిన్న పిల్లలకు సకాలంలో టీకా లు వేయించడానికి శ్రద్ద చూపాలని, అలాగే పట్టుపాలు కన్నా తల్లి పాలు ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు.ప్రభుత్వం అన్ని ప్రాదమిక తదితర ఇతర హాస్పిటల్ లో పిల్లలకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ ఇంటింట సర్వే లో జి.శ్రీనివాస్,ఏ.భాషా,రాజుమ్ బీ ఆశాలు ఏయన్ ఎమ్ లు తదితరులు పాల్గొన్నారు.