
మనన్యూస్,నెల్లూరురూరల్:భూమి ఇన్ఫ్రా రియాల్టీ బిజినెస్ ప్రారంభించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఆమంచర్ల దగ్గర మటెంపాడు వద్ద వంద రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు అక్షయ రెడ్డి, మిస్ నెల్లూరు 2025 అని హనీప్రియ సత్యం జీ అధినేత సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సంస్థ ఎండి శ్రీహరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ…… మా సమస్త స్థాపించి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వంద రోజులు వేడుకలు నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఈ వంద రోజులు మాకు సహాయ సహకారాలు అందించిన మార్కెటింగ్ సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులు, ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఆ సంస్థకు ఫోర్ పిల్లర్స్ అవి 1.ల్యాండ్ లార్డ్ 2. మార్కెటింగ్ సిబ్బంది 3. ఖాతాదారులు 4. సమస్త సిబ్బంది ఇవే మా సంస్థను ముందుకు నడిపిస్తున్నాయి అని అన్నారు.
ఈ సంస్థ చైర్మన్ ఎం కోటేశ్వరావు మాట్లాడుతూ…..మా మాటను మన్నించి ఈ వంద రోజులు వేడుకల కు విచ్చేసిన అక్షయ రెడ్డి, హనీప్రియ, సత్యం జి అధినేత సత్యనారాయణ, మార్కెట్ సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
మా సంస్థకు ఖాతాదారులే మా విజయానికి తోడ్పాటును ఇస్తున్నారు. ఈ వెంచర్ దగ్గరలో సినీ నటులు ఆలీ రిసార్ట్స్,రింగ్ రోడ్డు వస్తున్నాయి అని అన్నారు. భూమి ఇన్ఫ్రా రియాల్టీలో పెట్టుబడి మీ భవిష్యత్ కు రాబడి అని తెలియజేశారు. భూమి ఇన్ఫ్రా రియాల్టీ ఖాతాదారులు నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయదు అని అన్నారు. అక్షయ రెడ్డి మాట్లాడుతూ…తల్లిని, భూమిని నమ్మితే ఎవరూ నష్టపోరు అని అన్నారు. ఈ వంద రోజులు వేడుకలకు రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ సంస్థ మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు.
హనీ ప్రియ మాట్లాడుతూ…. భూమి ఇన్ఫ్రా రియాల్టీ వంద రోజులు వేడుకలకు రావడం చాలా సంతోషం కలిగిస్తుంది అని అన్నారు.ఇలాంటి వేడుకలకు పాల్గొనడం చాలా ఆనందం కలిగిస్తుంది అని అన్నారు.
సత్యం జీ మాట్లాడుతూ….. ఈ సంస్థ చైర్మన్ ఎం కోటేశ్వరావు సుదీర్ఘ అనుభవంతో ఈ సంస్థను విజయ పదంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
