మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించిన మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ పేరిట నిర్వహించి అలుపెరగని పోరాటంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో అమలులోకి రావడం ఆనందంగా ఉందంటు కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, నగర పంచాయతీ ఏలేశ్వరం,అంబేద్కర్ నగర్లో మాదిగల విజయంగా సంబరాలు జరుపుకుంటున్నామంటూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కాకాడ నాగేశ్వరరావు అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై తన కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా మాదిగల అభివృద్ధికి ఏబిసిడి వర్గీకరణ సాధనకై పోరాటం సలిపిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పూలు,పాలతో అభిషేకం చేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు 18 వ వార్డు కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు, గండేటి కిషోర్, పలివెల నూకరాజు, వేమగిరి ప్రేమానందం, వంగలపూడి నాగబాబులతోపాటు నగరంలోని మహిళలు,యువకులు పాల్గొన్నారు.