మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ దీపు హత్యను నిరసిస్తూ ఏలేశ్వరంలో ట్రాన్స్ జెండర్లు శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ట్రాంజెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్ జెండర్స్ మాట్లాడుతూ తమ విధిరాత బాగోక సమాజంలో చిన్నచూపుకు గురవుతూ బ్రతుకులు వెల్లదీస్తున్నామన్నారు.అటువంటిది వారి పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆడుకోవడమే కాక, ఎదురు తిరిగి పోరాడలేని తమపై హత్యలు ఎంతవరకు సమంజసం అన్నారు.ఇటీవల అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితుడ్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నిషా,గీత,సౌమ్య,రక్షిత, రాధిక తదితర ట్రాంజెండర్లు పాల్గొన్నారు.