మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేరు జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలకు జలాశయంలో సహజసిద్ధంగా పెరిగే చేపలతోపాటూ మరింత లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా శనివారం కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి వి. కృష్ణారావు చేతుల మీదగా ఎన్డిఏ కూటమి నాయకులు మరియు మత్స్యకారుల సమక్షంలో ఐదు ఐషర్ వాహనాలలో సుమారు 5.04 లక్షల మేలుజాతి కట్ల,రోహూ మరియు మృగల చేప పిల్లలను ఏలేరు జలాశయంలో జె.అన్నవరం గగ్రామం వద్ద విడుదల చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా -జిల్లా మత్స్య శాఖ అధికారి వి. కృష్ణారావు మాట్లాడుతూ ఏలేరు జలాశయం విస్తరించి ఉన్న ఐదు మండలాలలోని గల గ్రామాలలో నివసిస్తున్న సుమారు 4300 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పించబడుతుందని దీని ద్వారా ఈ గ్రామాలలో ప్రజలకు సరైన అందుబాటు ధరలలో నాణ్యమైన చేప లభించడంతో పాటుగా ప్రోటీన్ మరియు పోషకాలు కలిగి ఉన్న ఆహార భద్రత కల్పించబడుతుందని వివరించారు.తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బి. రంగారావు,తాళ్ళరేవు మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎం.లావణ్య,మరియు ఏలేశ్వరం మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి బి.రాజేంద్ర రావు పాల్గొన్నారు.