మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండలం నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకాల గ్రామానికి చెందిన పాలెం అంజన్న అనే వ్యక్తి మృతికి కారణమైన నిందితురాలు, భార్య పాలెం రంగమ్మ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి మరికల్ సర్కిల్ ఆఫీస్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితురాలి వివరాలు వెల్లడించారు.
పాలెం అంజన్న s/o సవరన్న, వయస్సు 41 సం.లు, వృత్తి చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలలో అటెండర్. అనే వ్యక్తి తేది:20.03.2025 నాడు రాత్రి ఏడు గంటల తర్వాత నేరస్తురాలైన భార్య పాలెం రంగమ్మ w/o పాలెం అంజన్న, వయస్సు 35 సం.లు మృతుడైన అంజనతో పొలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మృతుడైన అంజన్న పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమిని తన పేరు మీద చేయకుండా పాలివారికి చేయడంపై మరియు భూమి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదనీ కోపంతో భర్త తాగిన మైకంలో ఉన్న సమయంలో భర్త ఎదలపై కూర్చొని పొడవాటి తగ్గి తాడుతో భర్త మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపినాదని అట్టి మృతికి కారణమైన నిందితురాలును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్వ ఎస్ఐ కుర్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..