మనన్యూస్,తిరుపతి:ఈనెల 18,19,20వ తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడిచే మన్ననలు పొందిన శాప్ ఛైర్మన్ రవినాయుడుని తిరుపతిలో స్థానిక ఎమ్మెలే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడల నిర్వహణలో రవినాయుడు చూపిన శ్రద్ధ, కృషిని ప్రశంసించారు. కూటమి అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, జనసేన పార్టీ నగర రాజారెడ్డి, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.