మనన్యూస్,తిరుపతి:నగర పాలక సంస్థకు సంబంధించిన ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు నిర్వహించిన వేలంలో 4.76 కోట్ల రూపాయలతో మోహన్ బాబు దక్కించుకున్నారని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 22 వ తేదీ ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇందులో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ను జి. ఎన్. మోహన్ బాబు 4,76,00,000 రూపాయలకు, రామచంద్ర గుంట కట్ట మార్కెట్ ను పి. యస్.మునిరాజ బాబు 2,34,000 రూపాయలకు, జంతు వధశాలను పి.యస్.మునిరాజ బాబు 4,00,000 రూపాయలకు, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు వగైరా తిలక్ రోడ్డు మార్టినల యందు హరే రామ హరే కృష్ణ గుడి రోడ్డు ఇరు ప్రక్కల, కపిల్ తీర్ధం జంక్షన్ యందు పార్కింగ్ స్థలములను బి.విష్ణు వర్ధన్ 33,00,030 రూపాయలకు, శ్రీనివాసం ఏరియా ఎదురుగా భారతీ బస్ స్టాండ్ పార్కింగ్ స్థలమును యం.కె.సురేష్ కుమార్ 10,40,000 రూపాయలకు, జి.ఎన్. మరియు జి.యస్.పార్కింగ్ స్థలమును యం.కృష్ణమూర్తి 3,35,599 రూపాయలకు పాడి హెచ్చు పాటదారులుగా నిలిచారు. కాగా వినాయక సాగర్ పార్కుకు ముగ్గురు డిపాజిట్ చెల్లించగా, ఒకే సీల్డ్ టెండర్ వచ్చింది. డబ్బులు చెల్లించి బహిరంగ వేలంలో ఎవ్వరూ పాల్గొననందున, సీల్డ్ టెండర్ లో సంవత్సరానికి 18 లక్షల రూపాయలు కోడ్ చేశారు. నగరపాలక సంస్థ నిర్ణయించిన అద్దె కంటే తక్కువ కావడంతో వాయిదా వేశారు. వినాయక సాగర్ పార్కులో "గేమ్ జోన్"ను, బొంతాలమ్మ గుడి వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సు రెండవ అంతస్తు హాలుకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఇందిరా మైదానము) కు వేలంలో ఎవ్వరూ పాల్గొనలేదు. నగరపాలక సంస్థ నియమ నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నడుచుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. ఈ వేలం పాటలో డిప్యూటీ కమిషనర్ అమరాయ్య, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, తదితరులు ఉన్నారు.