మనన్యూస్,తిరుపతి:రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.
పేదలను అభివృద్ధిపథంలోకి తీసుకొచ్చేందుకు పి4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. నలభైవ డివిజన్ వార్డు సచివాలయం ఆవరణలో శనివారం ఉదయం పి4 వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅథిదిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరైయ్యారు. వార్డులోని పేదల వివరాలు, ప్రభుత్వ పథకాల వివరానులను మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. పేదరిక నిర్మాలనే లక్ష్యంగా పి4 విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పేదరిక నిర్మూలనలో ధనవంతులను భాగస్వామ్యం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని వీరికి ప్రజలంతా అండగా నిలబడాలని ఆయన కోరారు. వార్డు పరిధిలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఎన్డీఏ నాయకులు ఎస్కే బాబు, రాజా రెడ్డి, హరిశంకర్, రమణా రెడ్డి, సుబ్బారావు, రమణా రాయల్, బాలిశెట్టి కిషోర్, సుభాషిణి, సూర్యకుమారి, తోట జయంతి, ఆళ్వార్ మురళీ, మధు, మునస్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.