మనన్యూస్,కోవూరు:విడవలూరు ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి.ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తా.ధాన్య సేకరణకు సంబంధించిన ముఖ్యమంత్రి, పొరసరఫరా శాఖా మంత్రుల దృష్టికి తెచ్చాను.ధాన్యం రవాణా చేసుకునేందుకు లారీల కొరత లేకుండా చూడండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అండగా వుంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండల కేంద్రంలోని ప్రాధమిక సహకార సంఘ ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరగా 19 వేల 720 రూపాయలు అందుతున్నాయా లేదా అని వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద రైతుల నుంచి ధాన్య సేకరణకు మొగ్గు చూపుతున్న అధికారులు చిన్న, సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదన్న రైతుల ఆవేదనపై స్పందించారు. ధాన్యం సేకరణలో రైతుల పట్ల ఎటువంటి వివక్ష చూపవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీల కొరత గురించి రైతులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తేవడంతో వెంటనే జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే 32 మిల్లర్లతో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పందం కుదిరి వుందని అవసరమైతే ప్రకాశం, బాపట్ల పరిధిలోని మిల్లర్లను ధాన్య సేకరణ చేసేలా అధికారులు సమాయత్తం చేస్తున్నారన్నారు. రైతులకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో చర్చించిన విషయాన్ని రైతులకు వివరించారు. గిట్టుబాటు ధరపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఎక్కడైనా అధికారులు సహకరించకపోతే తన దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి,అడపాల శ్రీధర్ రెడ్డి, మాతూరు శ్రీనివాసులు రెడ్డి, పురంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.