Mana News, Tirupati :- అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శాప్ చైర్మన్ A.రవినాయుడు ఆధ్వర్యంలో తి.తి.దే. ధర్మకర్తలమండలి అధ్యక్షులు B.R. నాయుడు కి ప్రాజెక్టు కళాకారులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఉద్యోగభద్రత కల్పించాలని,స్విమ్స్ వైద్య సేవలు, ID కార్డు,లడ్డుకార్డు మంజూరు చేయాలని కోరారు.TTD నిర్వహిస్తున్న అన్నమాచార్య ప్రాజెక్టు లో గత 24సంవత్సరాలు గా దాదాపు 320మంది కళాకారులు ప్రతి రోజు స్వామి వారి సంగీత కార్యక్రమాల్లో రాష్ట్ర నలుమూలల ఉన్న దేవాలయాల్లో సంగీత కచ్చేరీలు నిర్వహిస్తువుంటారు. ప్రాజెక్టు కళాకారులకు మీ ఆధ్వర్యంలో వీరి సమస్యలు పరిష్కరిస్తారని వినమ్రతతో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో ప్రాజెక్టు యూనియన్ నాయకులు Y. హేమప్రకాష్, K. దేవానంద,G. నారాయణ, J. ఉదయభాస్కర్, M. హేమకుమార్, M. మోహన్ తదితరులు పాల్గొన్నారు.