మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమరావతి మండల అధ్యక్షులు, రాష్ట్ర మండల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షులు మేకల హనుమంతరావును శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర మండల అధ్యక్షుల, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఐఎఎస్ తో సమావేశపరిచి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి 3 లక్షల రూపాయలు గా ఉన్న పరిపాలనా అనుమతిని 10 లక్షల రూపాయలకు పెంచినందుకు ముఖ్య కారకులు అయిన అమరావతి ఎంపీపీ, రాష్ట్ర ఎంపీపీల సమాఖ్య అధ్యక్షులు మేకల హనుమంతరావును కలసి సన్మానించడం జరిగిందని అన్నారు. పరిపాలన అనుమతిని ఈ విధంగా పెంచడంపై జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు వర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేశారు. అనుమతిని పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపీపీల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.