మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపాలపట్నం గ్రామంలో గల అటవీశాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఎఫ్ ఆర్ ఓ తేజస్విని ఆధ్వర్యంలో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల ప్రాముఖ్యత , వాతావరణంలోని మార్పులు, జీవన వైవిధ్యంలోని సమతుల్యత దెబ్బతినకుండా అడవులు ఎంతో తోడ్పడతాయని, అడవుల పెంపకం వలన సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకారంగా ఉంటుందని, గ్రామాల్లో మొక్కల పెంపకం, నేటి మానవ అవసరాలకు కనుమరుగైపోతున్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ ర్యాలీలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.