మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తాసిల్దార్ అద్దంకి నరేష్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి, ఏప్రిల్ 4 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా ఉండాలని, దీనిపై స్థానిక సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.పదో తరగతి పరీక్షా కేంద్రాలను యు డి సి శ్రీను, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణేష్, జూనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పరిశీలనలో పాల్గొన్నారు.