మనన్యూస్,పినపాక నియోజకవర్గం:పి.వి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలనీ కోరుతూ ఏరియా ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పీవీ కాలనీ హైస్కూల్లో భోజనశాల (డైనింగ్ హాల్)లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెట్ల కింద భోజనాలు చేస్తుంటే కోతులు భోజనాలు చేయనివ్వటంలేదని అలాగే తరగతి గదులు కూడా మరమ్మతులు నిర్వహించాలని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయనీ దయచేసి తరగతి గదులు ఫ్యాన్లు మరమ్మతులు నిర్వహించాలని నూతన భోజనశాల నిర్మాణానికి తగు నిధులు మంజూరు చేయించాలని కోరుతున్నాను వేసవి సెలవుల్లో మరమ్మత్తులు, నిర్మాణ పనులు నిరాఘాటంగా కొనసాగించ వచ్చని మనవి చేసినట్లు ఆయన తెలిపారు.